లీకైన ఫోటోలు.. కొరటాల శివ మూవీలో నక్సలైట్‌గా చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే మీడియా చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఆయనకు సంబంధించి, ఆయన సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏ వార్త వస్తుందా అంటూ మీడియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. సైరా సినిమా తర్వాత చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకేక్కిస్తుంది.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సన్నివేశాలను ఈ వారం ఎక్కువగా తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి మావోయిస్ట్ గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఈ లుక్ లో మావోయిస్ట్ డ్రెస్ వేసుకున్న చిరూ, మెడలో యెర్ర జెండా వేసుకుని ఉన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ ఎవరో ఫోటో తీసి బయటపెట్టారు.

ఈ లుక్ లో చిరంజీవి సన్నబడ్డారు. సైరా సినిమా సమయంలో లావుగా ఉన్న చిరంజీవి ఈ సినిమా కోసం మాత్రం బరువు తగ్గారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల అవుతుందా వచ్చే ఏడాది విడుదల అవుతుందా అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమాకు నిర్మాత కూడా రామ్ చరణే. సినిమా టైటిల్ ని ఇంకా ఖరారు చేయకపోయినా… ఆచార్య అనే టైటిల్ వినపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version