సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి.. ఏపీ మంత్రులపై చిరంజీవి ఘాటు కామెంట్స్

-

ఇటీవల సినిమా ఇండస్ట్రీపై రాజకీయ నేత విమర్శలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాపై ఏపీ సర్కార్, ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా.. గతకొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న కొన్ని రాజకీయాంశాలపై చిరంజీవి మాట్లాడారు.

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ వేడుకలోనే చిరంజీవి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.  అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి..’’ అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version