‘మిస్​ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని మొదట చూసింది నేనే’.. చిత్రబృందానికి మెగాస్టార్ విషెస్

-

మెగాస్టార్ చిరంజీవి తాజాగా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమాను చూశారు. ఆ సినిమా గురించి పొగుడతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టు చూసిన అభిమానులు.. ఇన్నాళ్లూ చిరు లీక్స్ సినిమాలకే అనుకున్నాం.. ఇప్పుడు చిరు రివ్యూ లీక్స్ కూడా చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా గురించి మెగాస్టార్ ఏమన్నారో తెలుసా..?

”మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేశ్​ను అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్​ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!’ అంటూ మెగాస్టార్ తన పోస్టులో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version