హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో చిరంజీవి సినిమా?

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారట. బివిఎస్ రవి అందిస్తున్న కథతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హరీష్ ప్రస్తుతం రవితేజతో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ పనుల్లో బిజీగా ఉన్నారు.

chiranjeevi to join hands with fanboy harish shankar

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ఠతో తన 156 సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని అనౌన్స్ చేస్తూ.. సినిమా కాన్సెప్ట్ టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ చిత్రం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాని దాదాపు 75 శాతం VFX పైనే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news