అనుష్క వల్లే నయనతార టాలివుడ్ కి దూరం జరిగిందా…?

-

అనుష్క, నయనతార” దక్షిణాదిని ఒక ఊపు ఊపేస్తున్న హీరోయిన్లు. మూడు పదుల వయసు దాటినా సరే వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. భారీగా పారితోషకం తీసుకుంటూ ఇప్పటికి తమ డిమాండ్ ని కొనసాగిస్తున్నారు. తమిళంలో, తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతో వీళ్ళు సినిమాలు చేసారు. స్టార్ హీరోలు అందరికి వీళ్ళు హిట్లు ఇచ్చారు. తమిళం విషయం ఏమో గాని తెలుగులో మాత్రం వాళ్లకు అంటూ,ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

స్టార్ హీరోలతో సమానంగా వాళ్లకు ఫ్యాన్ బేస్ ఉంది. అయితే కొన్ని రోజులుగా నయనతార టాలివుడ్ కి దూరంగా ఉంది. వరుసగా సినిమాలు చేసి ఇక్కడ కాళీ లేకుండా గడిపిన ఆమె, ఇప్పుడు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా, అనుష్క తో ఉన్న విభేదాలు కారణంగా ఆమె టాలివుడ్ కి దూరం జరిగినట్టు తెలుస్తుంది.

ఒక థ్రిల్లర్ కథ విషయంలో అనుష్క ప్రదర్శించిన దూకుడే కారణం అని సమాచారం. కొన్ని రోజులుగా అనుష్క థ్రిల్లర్ సినిమాలు చేస్తుంది. ఆ సినిమా కథ ముందు నయనతార వద్దకు వెళ్ళగా తాను ఒక ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్నాను కొన్ని రోజులు ఆగమని దర్శకుడు తో చెప్పగా ఆ దర్శకుడు తర్వాత అనుష్క కు వినిపించాడట. వెంటనే అనుష్క ఓకే చేసిందట… దీని మధ్య ఇద్దరితో విభేదాలు వచ్చాయని, అప్పటి నుంచి ఆగ్రహంగా ఉన్న నయనతార టాలివుడ్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version