ఆయన వల్లే ప్రేమించగలిగాను – సాయి పల్లవి..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా సరే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎటువంటి వల్గారిటికి పోకుండా చాలా హోమ్లీగా కనిపిస్తూ పద్ధతిగా ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కాదు గౌరవం కూడా.. ఇక అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా చేయించుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది.

కొద్ది రోజులుగా సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది అని చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్ గా మారడంతో నిర్మాతలకు నష్టం రావడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడకూడదని సినిమా ఇండస్ట్రీకి దూరం అయింది. ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక పోస్టును అభిమానులతో పంచుకుంది. గతంలో ఆమె నటించిన గార్గి సినిమా జూలై 15న రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే.

మొన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ సినిమా షూటింగ్ విషయాలను.. ఆ సినిమాలోని తన పాత్ర విషయాలను కూడా పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలోనే ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా వదిలింది సాయి పల్లవి.. గార్గి సినిమా వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయింది. అందులోని ఆ పాత్ర నన్ను ఎంతగానో సినిమాలను ప్రేమించేలా చేసింది. అయితే ఈ అవకాశం నాకు ఇచ్చిన దర్శకుడు గౌతమ్ కి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

Read more RELATED
Recommended to you

Latest news