నేడు, రేపు బెంగళూరులో విపక్షాల సమావేశాలు… హాజరు కానున్న ఆప్‌

-

కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల భేటీ కానుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా నేడు, రేపు బెంగుళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల భేటీ జరగనుంది. చాలాకాలం తర్వాత సోనియా గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మొత్తం 24 పార్టీలకు ఆహ్వానం పలికామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై చర్చలు సాగనున్నాయి.

సీఎం సిద్ధరామయ్య నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆప్‌ కూడా హాజరు కానుంది.   ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 10 రోజుల పాటు రైతు సభలు జరుగనున్నాయి. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ నేతల వాక్యాలకు నిరసనగా నేటి నుంచి 10 రోజులపాటు రైతు సభలను BRS నిర్వహించనుంది. ప్రతి వేదిక వద్ద వెయ్యి మంది రైతులతో సమావేశం నిర్వహించి, కాంగ్రెస్ కుట్రలను విడమరిచి చెప్పాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు ఆదేశించారు. 3 గంటల కరెంట్ కావాలా? 3 పంటలు కావాలా? అనే నినాదంతో దూకుడుగా వెళ్లాలని సూచించారు. దీంతో BRS నేతలు అన్ని నియోజకవర్గాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news