సిక్స్ ప్యాక్ బాడీ.. స్టైలిష్ లుక్.. మహర్షిలో రిషి ఎన్నో కొత్త అనుభూతులు అందించేలా ఉన్నాడు. సిఎం టూ స్టూడెంట్ గా మహేష్ మేకోవర్ నిజంగా వావ్ అనేలా ఉంది. సినిమా కథల విషయంలోనే కాదు లుక్ విషయంలో కూడా ఇక నుండి మహేష్ కొత్తగా చేయబోతాడని తెలుస్తుంది.
వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ మహర్షి సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.