స్టూడియోలో బీరు కొట్టిన నాగార్జున..!

-

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఎలాంటి విషయాన్నైనా సరే ఆడియెన్స్ తో పంచుకునేందుకు వెనుకాడడు. కొన్నిసార్లు అరే నాగార్జున ఏంటి ఇలా ఓపెన్ అయ్యాడని అవాక్కవుతారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ ఇలా ప్రతి విషయం సందర్భాన్ని బట్టి నాగ్ బయటపెడతారు. ఇక లేటెస్ట్ గా గూఢచారి సక్సెస్ మీట్ లో కూడా అన్నపూర్ణ స్టూడియో తాను బీరు కొట్టిన విషయాన్ని ప్రస్థావించారు.

ఏయన్నార్ అన్నపూర్ణ స్టూడియో కొన్నప్పుడు అంతా అడవిలా ఉండేదట. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో నాగార్జున బీరు కొట్టారట. అలాంటి ప్రదేశాల్లో గూఢచారి షూటింగ్ జరిపారని అన్నాడు నాగార్జున. సినిమా 17 రోజుల దాకా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిపారు అయితే ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోలా అనిపించలేదని అన్నారు నాగార్జున. తనకే తెలియని లొకేషన్స్ లో సినిమా షూట్ చేశారు గూఢచారి టీం.

ఇక ఇంత తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ మూవీ తీయడం చాలా గొప్ప విషయమని అన్నారు. సినిమా హిమాచల్ ప్రదేశ్ లో కూడా షూటింగ్ జరిపారు కాని తాను చూసిన లొకేషన్స్ కన్నా కొత్త లొకేషన్స్ లో షూట్ చేశారని గూఢచారి గురించి గొప్పగా మాట్లాడారు నాగార్జున.

Read more RELATED
Recommended to you

Exit mobile version