కలెక్టర్ కి మినిస్టర్ కి జరిగే వారే గేమ్ ఛేంజర్ మూవీ అని ఆ సినిమా డైరెక్టర్ శంకర్ రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించారు. ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. తన 30 ఏళ్ల సినీ కెరీర్ లో తాను ఇప్పటివరకు 14 సినిమాలు చేశాను. అందులో ఒక్కటి కూడా తెలుగులో నేరుగా తీయలేదు. దాదాపు అన్ని తమిళంలోనే చేశాను. ఆ సినిమాలకు తెలుగు డబ్బింగ్ చేశాం. డబ్బింగ్ చేసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.
ఇక ఈ గేమ్ ఛేంజర్ సినిమా నేరుగా తెలుగులో తెరకెక్కించాను అని తెలిపారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్టు తెలిపారు. దిల్ రాజు, రామ్ చరణ్ తో తెలుగులో నేరుగా సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. “నా కూతురు పెళ్లికి రావాలని పవన్ వద్దకు వెళ్లాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు” అని పవన్ కళ్యాణ్ మంచి తనం గురించి శంకర్ చెప్పుకొచ్చారు.