గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అస్సలు మరిచిపోకూడదు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని మరిచిపోకూడదు. శంకర్ తీసిన జెంటిల్ మేన్ సినిమాను బ్లాక్ లో టికెట్ కొనుక్కొని చెన్నైలో వెళ్లాను. ప్రేమికుడు సినిమాకు తోడుకు ఎవ్వరూ లేకుండా మా అమ్మమ్మను తీసుకెళ్లినట్టు గుర్తు చేసుకున్నారు.
ఒక సోషల్ మెస్సెజ్ సినిమా తీస్తారు డైరెక్టర్ శంకర్. రామ్ చరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారిలో కీలక మైన వ్యక్తి శంకర్. తమిళనాడు నుంచి వచ్చి తెలుగులో సినిమా తీయడం గొప్ప విషయం అన్నారు. తొలిప్రేమ సినిమా సమయంలో డిస్ట్రిబ్యూటర్ గా పని చేశారు. వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు. జనసేన పార్టీ నడపడానికి వకీల్ సాబ్ సినిమా ఇంధనంగా పని చేసిందని తెలిపారు పవన్ కళ్యాణ్.