జాతిర‌త్నాలు బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు..

ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆఫ‌ర్లు వెతుక్కుంటూ రావ‌డం సినీ ఇండ‌స్ట్రీలో స‌హ‌జ‌మే. ఇలా చాలా మంది హీరోయిన్లు ఓవ‌ర్ నైట్ లో స్టార్ అయిపోయి వాళ్లు కూడా ఉన్నారు. ఒక‌ప్పుడు స‌మంత‌, శృతిహాస‌న్ ఇలా ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయారు. ఇక కొంద‌రు హీరోయిన్ల‌కు అయితే ఎంత క‌ష్ట‌ప‌డ్డా పేరు రాదు. ఈ కోవ‌లో కూడా చాలా మంది హీరోయిన్లే ఉన్నారు.

ఇప్పుడు ఓవ‌ర్ నైట్ స్టార్ కోవ‌లోకి వ‌చ్చింది జాతిర‌త్నాలు హీరోయిన్. ఈ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి’ పాత్రలో నటించి కుర్ర‌కారులో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ తన స్క్రీన్ ప్రెజన్స్ – క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో తొలి సినిమాతోనే అభిమానుల‌ను సంపాదించుకుంది.

హైదరాబాద్ కు చెందిన తెలుగమ్మాయి అయిన ఫ‌రియా దాదాపు ఏడేళ్లు థియేటర్ ఆర్టిస్ట్ గా ప‌ని చేసింది. ఆ టైమ్ లోనే ‘నక్షత్ర’ అనే వెబ్ సిరీస్ లో చేసింది. ఈ టైమ్ లోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దృష్టిలో పడింది ఈ క్యూటీ. దీంతో ‘జాతిరత్నాలు’ సినిమాలో న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ కావ‌డంతో అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. చాలా పెద్ద నిర్మాణ సంస్థలు ఈమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. షాప్ లు ఓపెన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక త్వ‌రలోనే మ‌రో సినిమా ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.