వరస ఫ్లాప్స్ వస్తున్నా రజనీకాంత్ సినిమాలో ఇవి మాత్రం తగ్గడం లేదేంటి ..?

-

కబాలి.. కాలా.. రోబో.. పేట..దర్బార్ …ఇవన్ని కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ సినిమాలు. ఒకదానికి మించి ఒకటి భారీ డిజాస్టర్ అయిన సినిమాలు కూడా. అయినప్పటికి రజనీకాంత్ క్రేజ్ గాని ఆయన రెమ్యూనరేషన్ గాని ఏమాత్రం తగ్గడం లేదు. ఇంత భారీ సినిమాలు కోలీవుడ్ లో సూర్య, విజయ్, అజిత్ లు కూడా చేయడం లేదు. అంతేకాదు ఇంత స్పీడ్ గా ఏ హీరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఈ వయసులో కూడా రజనీకాంత్ తన సత్తా చాటుతున్నాడంటే అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో నూ చాలా మంది స్టార్ హీరోలు షాకవుతున్నారు.

 

అయితే రజనీకాంత్ రీసెంట్ సినిమా దర్బార్ భారీగా నష్ఠాలను తెచ్చిపెట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ లబో దిబో మంటూ మొత్తుకున్నారు. వాస్తవంగా ఎప్పుడు సినిమాకి లాస్ వస్తే వెంటనే స్పందించే రజనీకాంత్ ఈ సారిమాత్రం ఎందుకనో మిన్నకుండిపోయారు. దాదాపు దర్బార్ కి 70 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న రజనీకాంత్ కొంత కూడా నష్ట పరిహారగా నిర్మాతకి గాని, డిస్ట్రిబ్యూటర్స్ కి గాని తిరిగివ్వలేదని ఆ మద్య తమిళ పరిశ్రమలో నానా రచ్చ జరిగింది. దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ అయితే ఏకంగా అల్లు అర్జున్ సినిమా అంటూ వచ్చి హైదరాబాద్ లో ఉండిపోయాడు.

 

అయినా ఇదంతా పట్టనట్టు రజనీకాంత్ తన నెక్స్ట్ సినిమాకి రెడీ అయిపోయాడు. తెలుగు వాడైనా శివ తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూ వరసగా అజిత్ తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. మాస్ కథాంశంతో శివ సక్సస్ ల మీద సక్సస్ లను అందుకుంటున్నాడు. దాంతో రజనీకాంత్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని శివ కి ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలవ్వాల్సింది. కాని కరోనా కారణంగా ఆగింది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తున్న సంగతి తెలిసందే.

 

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ వచ్చి చేరబోతుంది. అయితే సినిమాలు ఫ్లాపవుతూన్నా తన సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండేలా మాత్రం హంగులను అద్దుతున్నారు రజనీకాంత్. గత సినిమాలలో కూడా రాధికా ఆప్టే, ధన్సిక, సిమ్రాన్, నయన తార, నివేదా థాంస్ లాంటి వాళ్ళను నటింపజేశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళుతున్నారు. అయితే ఇది సూపర్ స్టామినా అనుకోవాలా లేదా పట్టుదల అనుకోవాలా అని కోలీవుడ్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version