టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరికి బంపర్ ఆఫర్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి బాధ్యతలు తీసుకోనుంది. ఈ తరుణంలోనే.. ఏపీ మహిళల కోసం పని చేయనున్నారు. కాగా.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. తాజాగా మీనాక్షి చౌదరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత దిల్ రాజు, వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించిన ఏపీ ప్రభుత్వం pic.twitter.com/zQgzKDOnGR
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025