ఎన్టీఆర్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య రచ్చ..తారక్ అభిమాని ఆత్మహత్యయత్నం

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది… ఒక “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమానే. ప్రపంచ దృష్టిని ఆకర్షించే… విధంగా… దర్శక దిగ్గజం ఎస్‌ ఎస్‌ రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా మార్చి 25 వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో కోదాడలోని ఓ థియేటర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తారక్‌, చరణ్‌ అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తారక్‌ ప్లెక్సీ కడుతుండగా.. చరణ్‌ అభిమానులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైందని చెబుతున్నారు. ఈ ఘర్షణలో తీవ్ర మనోవేదనకు గురైన ఎన్టీఆర్ అభిమాని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే.. పక్కన ఉన్నవారు వెంటనే అలర్ట్‌ అయి.. అతన్ని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలాగే.. కొందరు అభిమానులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version