నో చెప్పేసిందా.. బ‌న్నీకి షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్‌…!

718

టాలీవుడ్ స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అల వైకుంఠ‌పురంలో టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా త‌ర్వాత బన్నీ-దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్న సినిమా ఐకాన్.

సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఐకాన్ పేరుతో టైటిల్ కూడా పెట్టేసిన ఈ  కోసం కొద్ది రోజులుగా అన్వేష‌ణ జ‌రుగుతోంది. ఈ సినిమాకు ఓ రేంజ్ హీరోయిన్ కావాలన్నది బన్నీ కోరికగా తెలుస్తోంది. చివ‌ర‌కు దిల్ రాజు – వేణు కొంత‌మంది హీరోయిన్ల పేర్లు సూచించినా బ‌న్నీకి మాత్రం న‌చ్చ‌లేదు.

బ‌న్నీ మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియాభట్ కావాలని కోరిన‌ట్టు తెలుస్తోంది. వేణు శ్రీరామ్‌తో పాటు దిల్ రాజు ఆమెను అప్రోచ్ అయినా ఆమె మాత్రం నో చెప్పేసింద‌ట‌. వ‌రుస‌గా సినిమాల‌తో బిజీగా ఉన్న ఆమె బ‌న్నీ సినిమాలో చేసేందుకు ఒప్పుకోలేద‌ట‌. ఆలియా ఇప్పటికే తెలుగులో మెగా హీరో రామ్ చరణ్ సరసన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

దీంతో బ‌న్నీ కోసం మ‌రో క్రేజీ హీరోయిన్ వేట‌లో వేణు ఉన్నాడ‌ట‌. అంతెందుకు వైకుంఠ‌పురం సినిమా కోసం కూడా చాలా రోజుల పాటు హీరోయిన్ల వేట కొన‌సాగించారు. చివ‌ర‌కు బ‌న్నీతో డీజేలో జోడీ క‌ట్టిన పూజ‌తో సెట్ అయ్యారు. మ‌రోసారి బ‌న్నీ సినిమా కోసం హీరోయిన్ల వేట త‌ప్ప‌డం లేదు. సాహో రిజ‌ల్ట్ త‌ర్వాత శ్ర‌ద్ధాక‌పూర్‌ను కూడా ట్రై చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.