సంచలనం సృష్ఠిస్తున్న మెగా మేనల్లుడి “ఉప్పెన” క్రేజీ సాంగ్ ..!

-

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఏ హీరో అయినా ఏదో ఒక విషయంలో సంచలనం సృష్ఠించాల్సిందే. ఒక్కో హీరో కి ఒక్కో రకమైన ఇమేజ్ అండ్ క్రేజ్ దక్కుతోంది. అంతేకాదు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వస్తున్న ఇంకా ఎవరున్నరా .. అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ లోను అదే ఆసక్తి కలుగుతోంది.

 

వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం “ఉప్పెన”. ఈ సినిమా నుండి మార్చి 2న రిలీజ్ అయిన “నీ కన్ను నీలి సముద్రం”… అనే లిరికల్ వీడియో సాంగ్ సంచలనం సృష్ఠిస్తోంది. కేవలం మ్యూజిక్ లవర్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ని ఈ సాంగ్ కి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మంచి ట్యూన్ తో కాస్త విభిన్నంగా సాంగ్ ను కంపోజ్ చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి జావేద్ ఆలీ పాడిన విధానం.. శ్రీమణి సాహిత్యం ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. సినిమా రిలీజ్ కి ముందే ఈ సాంగ్ భారీ అంచనాలను పెంచేసింది. బుచ్చిబాబు సానా దర్శకుడిగా, వైష్ణ‌వ్‌ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version