అవ‌తార్ -2 నుంచి క్రేజీ అప్ డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్

-

తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు ఎంతో మందికి హాలీవుడ్ సినిమాను ప‌రిచ‌యం చేసిన అవ‌తార్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ప్ర‌పంచ సినిమాలోనే ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా అవ‌తార్. అయితే 2009లో విడుద‌ల అయిన ఈ అవ‌తార్ సినిమాను ప్ర‌పంచ మేటి ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్ సృష్టించాడు. అవతార్ ప్ర‌పంచ సినిమా చరిత్ర‌నే మార్చేసింది. అత్య‌ధిక క‌లెక్ష‌న్లు తో పాటు ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది.

అయితే 2009 లో వ‌చ్చిన అవ‌తార్ సినిమా కు సిక్వెల్ ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు జెమ్స్ కామెరాన్ గ‌తంలోనే ప్ర‌క‌టించాడు. దీంతో అవ‌తార్ అభిమానులు అవ‌తార్ – 2 కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. తాజా గా అవ‌తార్ – 2 నుంచి క్రేజీ అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. అవ‌తార్ సిక్వెల్ అవ‌తార్ – 2 ను ఈ ఏడాది డిసెంబ‌ర్ 16 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌కటించారు. స‌రికొత్త న‌టీ న‌టుల‌తో ఈ సినిమా రాబోతుంద‌ని మేకర్స్ ప్ర‌క‌టించారు.

 

కాగ ఈ సినిమాను ఏకంగా నాలుగు సిక్వెల్స్ గా తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌పంచ టాప్ డైరెక్ట‌ర్ జెమ్స్ కామెరాన్ ప్ర‌క‌టించాడు. అవ‌తార్ – 2 ఈ ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే అవ‌తార్ రెండో సిక్వెల్ ను 2024 డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే మూడో సిక్వెల్ ను 2026 డిసెంబ‌ర్, దీనితో పాటు నాల్గోవ సిక్వెల్ ను 2028 డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news