Dacoit : అడివి శేష్ ‘డెకాయిట్’ టీజర్​ రిలీజ్..

-

Dacoit Teaser Trailer : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ సినీ కెరీర్ లో గూఢచారి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత శేష్ వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు. వరుసగా మేజర్, హిట్ -2 సినిమాలు ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్న శేష్ తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు.టాలీవుడ్ యాక్టర్ అడవి శేష్, శృతిహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “డెకాయిట్”. ఒక ప్రేమకథ అనేది ఉపశీర్షిక.

Dacoit Teaser Trailer

ఈ ప్రాజెక్టు ద్వారా షనియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయగా…. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే….తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ టీజర్ ను విడుదల చేసింది. ఇక టీజర్ చూస్తే బద్ధ శత్రువులుగా మారిన ప్రేమికుల కథ అని తెలుస్తుంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుండగా…. షూటింగ్ మొదలైనట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news