తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని నిన్న దర్శించుకునేందుకు….3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిన్న ఒక్క రోజే టోకేన్ లేని భక్తులకు 06 గంటల సమయం పట్టింది. కాగా.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 67,043 మంది భక్తులు దర్శించుకున్నారు. కాగా.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 22, 112 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లుగా నమోదు అయింది.
కాగా, తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత టికెట్లు విడుదల కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మార్చి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటలకు మార్చి నెలలో నిర్వహించే వార్షిక తెప్పోత్సవాల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఇవాళ మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు కలిగిన భక్తులకు దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.