బిగ్​బాస్-7 నుంచి ఈ వారం దామిని ఎలిమినేట్.. షాక్​లో ఆడియెన్స్

-

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-7 మూడో వారం పూర్తి చేసుకుంది. మూడో వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు బిగ్​బాస్ నిర్వాహకులు. ఈ వారం ఎలిమినేషన్​లో ప్రియాంక జైన్‌, శుభశ్రీ, రతికా రోజ్‌, దామిని, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు ఉండగా.. వారిలో దామిని ఎలిమినేట్ అయింది. ఈ వారం ప్రియాంక జైన్‌, శుభశ్రీ, రతికా రోజ్‌, దామిని, ప్రిన్స్‌ యావర్‌, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌ నామినేషన్స్‌ ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు.

ఈ సందర్భంగా ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ‘ఏది పేలిపోతే వారు ఎలిమినేట్‌ అయినట్లు’ అని నాగార్జున ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్‌ పేలిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్‌, సందీప్‌ మాస్టర్‌ ఎమోషనల్ అయ్యారు. అయితే దామిని ఎలిమినేషన్ అటు హౌజ్​మేట్స్ ఇటు ప్రేక్షకులు ఎవరూ ఊహించలేదు. సోషల్ మీడియా మొత్తం దామిని ఎలిమినేషన్​ను వ్యతిరేకిస్తోంది.

అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన దామిని ఇంకొన్ని రోజులు బిగ్‌బాస్‌లో ఉంటానని అనుకున్నానని చెప్పింది. ఎలిమినేషన్‌ అస్సలు ఊహించలేదని.. హౌస్‌లోకి వచ్చి మూడు వారాలే కావడంతో, ఇంట్లో వాళ్లను వదిలేసి వచ్చానన్న ఫీలింగ్‌ కూడా లేదని.. ఇంకా ముందుకు వెళ్తానని అనిపించిందని దామిని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version