రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణమురళి ఉన్నారు.. జైలులో పోసానికి ప్రత్యేక గది కేటాయించారు అధికారులు. ఇంటి ఫుడ్ కూడా అందించబోతున్నారని సమాచారం. నిన్న రాత్రి పోసానికి మరోసారి వైద్య పరీక్షలు చేశారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ వేశారు.. ఇవాళ, రేపు సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.. సోమవారమే పీటీ వారెంట్ వేయనున్నారు పోలీసులు.
ఇక అటు పోసాని కృష్ణ మురళిపై 17 కేసులు నమోదు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. ఇక వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేర అంటూ…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పోసాని కృష్ణ మురళి అరెస్ట్ పై హోం మంత్రి అనిత స్పందిస్తూ.. వైసీపీ పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ బుక్ ప్రకారం మేం ముందుకెళ్తే వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.