ధనుష్ బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్

-

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ తెలుగు తెరకు అక్కర్లేని పరిచయం. ఆయన తీసే సినిమాలు డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ హీరో ధనుష్. కానీ ఇప్పటి వరకు ఆయన ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా తీయలేదు. అందుకే తన తెలుగు ఫ్యాన్స్ కోసం ధనుష్ ఓ సూపర్ హిట్ సినిమా అందించేందుకు రెడీ అయ్యారు. ఆ సినిమాయే ‘సార్’.

ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘సార్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, అదే విధంగా మూవీ టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈనెల 27న ‘సార్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు. ఈనెల 28న ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యాన్స్ కు అదిరిపోయే మరో గిఫ్ట్ ను కూడా రెడీ చేశారు. అదే ‘సార్’ సినిమా టీజర్. ధనుష్ బర్త్ డే స్పెషల్ గా ఆయన టాలీవుడ్, కోలీవుడ్ ఫ్యాన్స్ కోసం ‘సార్’ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించారు.

‘యాన్ యాంబీషియ‌స్ జ‌ర్నీ ఆఫ్ ఎ కామ‌న్ మ్యాన్’ అనేది ‘సార్’ మూవీ థీమ్. హృదయాన్ని హత్తుకునే లవ్ స్టోరీ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళీ ముద్దుగుమ్మ, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్తా మీనన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకొనే సంగీతం స‌మ‌కూర్చ‌డంలో దిట్ట అయిన జి. వి. ప్ర‌కాష్‌కుమార్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఈ సినిమా తమిళంలో కూడా తీస్తున్నారు. తమిళంలో ఈ చిత్రానికి వాతి అనే పేరు ఖరారు చేశారు. తమిళ్, తెలుగు ఫస్ట్ లుక్, టీజర్ ఒకేసారి విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version