ఆ విషయమై జాన్వీకపూర్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

-

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీకపూర్…బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తండ్రి బోనీ కపూర్ సూచనలతో కెరీర్ లో ముందుకు సాగుతున్నది. కాగా, తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ పిక్చర్ ప్రమోషన్స్ లో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఆమెను ట్రోలింగ్ కు గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏ విషయమై కామెంట్స్ చేసిందంటే..

 

జాన్వీ కపూర్ కు స్కూల్ డేస్ నుంచి చరిత్ర అంటే చాలా ఇష్టమట, ఆ సబ్జెక్ట్ లో బాగా పట్టుందని ఆమె భావన. అయితే, మ్యాథ్స్ అంటే మాత్రం చాలా కష్టం అనిపించింది. ఈ క్రమంలోనే మ్యాథ్స్-హిస్టరీ..రెండిటికీ లింక్ పెట్టి మాట్లాడింది. క్యాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాతనే లెక్కలు చేయడం ఈజీ అయిందని, అటువంటప్పుడు ఆల్ జీబ్రా నేర్చుకోవడం ఎందుకని తలలు పట్టుకుంటున్నారు ? అని అడిగింది.

గణితం మీ లైఫ్ ను ఇబ్బందుల్లోకి నెడుతుందన్న అర్థం వచ్చేలా జాన్వీ కపూర్ మాట్లాడింది. అలా జాన్వీ కపూర్ మాట్లాడిన మాటలు లాజిక్ లెస్ గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తనకు లెక్కలు రాక గణితాన్ని జాన్వీ కపూర్ నిందిస్తున్నదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాన్వీ కపూర్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version