ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమాని కొంత మంది అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అవుతున్నారు. ఆ కోవకు చెందిన భామ దీప్తి సునయన. యూట్యూబ్ స్టార్‌గా సోషల్ మీడియాలో పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లోకి కంటెస్టెంట్ గా వెళ్లి తన క్రేజ్ ను ఇంకా పెంచేసుకుంది. ఈ క్యూట్ లుక్స్ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది.
‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ఫేమస్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తో ప్రేమలో ఉన్న ఈ భామ.. సిరి హన్మంత్ కారణంగా షణ్ణుకు నో చెప్పేసింది. ఇక అప్పటి నుంచి ఈ భామ సింగిల్ గానే ఉంటుంది. అలా ‘బిగ్ బాస్’ వలన దాదాపు ఐదేళ్ల పాటు ఉన్న షణ్ముక్- దీప్తి సునయనల రిలేషన్ షిప్‌నకు ది ఎండ్ కార్డ్ పడింది. షణ్ముక్ తో విడిపోయిన తర్వాత ఈమె లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యూచర్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
కేరళలో బోటింగ్ సందర్భంగా దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో దీప్తి సునయన వెరీ క్యూట్ ప్లస్ హాట్ గా కనబడుతోంది. బ్లాక్ కలర్ శారీలో మల్టీకలర్ జాకెట్ ధరించి అలా నడుము అందాలు చూపుతూ కుర్రకారు మతి పోగొడుతోంది. అలా చీర కొంగును నడుములో చెక్కుకుంటూ, కొంటెగా చూస్తూ చూపులతోనే పిచ్చెక్కిస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వెరీ నైస్, హాట్, బ్యూటిఫుల్, క్యూట్’ అని కామెంట్స్ చేస్తున్నారు.