నేడు అహాలో బండ్ల గణేష్ “డేగల బాబ్జి”

-

నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎన్ని భారీ సినిమాలకు నిర్మాతగా బండ్ల గణేష్ వ్యవహరించారు. అయితే భారీ సినిమాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా మారబోతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వెంకట చంద్రన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ…. ఎస్ రిషి ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా స్వాతి చంద్ర నిర్మిస్తున్న సినిమాలో బండ్ల గణేష్ హీరోగా నటించనున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు మరియు టీజర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా డేగల బాబ్జి సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఆహాలో ఈ సినిమా ట్రైలర్ ను నిన్న విడుదల చేసింది చిత్రబృందం.

 

బండ్ల గణేష్ చాలా కొత్తగా ఈ ట్రైలర్ లో కనిపించారు. ఈ సినిమా పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు మనకు కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఇవాల్టి నుంచి ఆహా ఓటీపీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రం బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version