యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతంగా ఓవర్ సీస్‌లో అతిపెద్ద మార్కెట్ క్రియేట్ చేసే దిశగా ముందుకు దూసుకువెళ్తోంది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్‌లో అత్యంత వేగంగా 1.7 మిలియన్ డాలర్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే కేవలం 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడు అయినట్లు వెల్లడించారు.
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 27న విడుదల కానుంది. ఈ మూవీకి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఇందులోని సాంగ్స్‌కు చాలా క్రేజ్ వచ్చింది. చుట్టమల్లె పాట 100 మిలియన్ లైక్స్‌ను సంపాదించుకుంది. ఈ మూవీ ఎన్టీఆర్ గత రికార్డులను చెరిపివేస్తుందని అటు అభిమానులు, ఇటు చిత్రయూనిట్ బలంగా విశ్వసిస్తోంది.