దేవర న్యూ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ వచ్చేది ఆరోజే

-

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి మరో కొత్త సినిమా రాలేదు. కానీ ఆయన ఓ మూడు నాలుగు సినిమాలకు మాత్రం సైన్ చేసినట్లు వార్తలొచ్చాయి. అందులో ఒకటే జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది కూడా. ఇప్పటికే పలు అప్డేట్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా దేవర టీమ్ కీలక అప్డేట్ ఇచ్చింది.

జనవరి 8వ తేదీన దేవర సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. హీరో తారక్ కూడా ఇదే విషయం ట్వీట్ చేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, జనవరి 8న దేవర గ్లింప్స్ రానున్నట్లు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై సంయుక్తంగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version