దేవర సెకండ్ సింగిల్ నుండి అదిరిపోయే సర్ ప్రైజ్..!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.  ఇప్పుడీ పాన్ ఇండియా మూవీ నుంచి సెకండ్ సింగిల్ కూడా రాబోతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ పోజులో ఉన్న పోస్టర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఆగస్ట్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎన్నో రోజులుగా ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే అంటూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్.. మొత్తానికి మరో మూడు రోజుల్లోనే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. మొదటి సాంగ్ దేవర గొప్పతనాన్ని చెబుతూ సాగిన మాస్ సాంగ్ కాగా.. రెండోది రొమాంటిక్ సాంగ్ కానుంది. తాజాగా ఈ సాంగ్ నుంచి చిన్న బిట్ విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇది ఇద్దరి కెమెస్ట్రీ అదుర్స్ అనిపించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version