హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘కుబేర’. ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యి కుబేర సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను ధనుష్ తన కుమారుడితో కలిసి చూసేందుకు చెన్నైలోని ఓ సినిమా థియేటర్ కు వెళ్లారు. అక్కడ తన కుమారుడితో కలిసి ఈ సినిమాను వీక్షించాడు.

బిచ్చగాడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తాను చేసిన నటనను చూసి ధనుష్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. కొన్ని సీన్లకు కంటతడి కూడా పెట్టుకున్నారు. సినిమా చూసినవారు సైతం ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూసే విధంగా చాలా బాగుందని ధనుష్ అభిమానులు అంటున్నారు. కాగా, ఈ సినిమాలో నాగార్జున, హీరోయిన్ రష్మిక పాత్రలు చాలా బాగున్నాయి. కుబేర సినిమాకు డీఎస్పీ సంగీతం అందించారు. కాగా, ధనుష్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ గా ఉంది.
Dhanush get emotional after seeing #Kuberaa Response 🥹🙏🙏@dhanushkraja WHAT A PERFORMANCE THROUGHOUT ENTIRE MOVIE 👏👏
— Dhanush Trends ™ (@Dhanush_Trends) June 20, 2025