Dhanush SIR.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ కలిసి జంటగా నటిస్తున్న చిత్రం సార్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బైలింగ్వల్ మూవీ గా తెరకెక్కుతోంది. సూర్యదేవరనాగ వంశీ , సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా థియేటర్లలో తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయ్యాయి. జీవి ప్రకాష్ కొట్టిన పాటలు ముఖ్యంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిజానికి ఈ సినిమా నుంచి ట్రైలర్ను తాజాగా విడుదల చేయగా తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా ట్రైలర్ ద్వారానే హిట్ పక్క అంటూ నిరూపిస్తోంది.
” చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ల కోసం ఉంటారు అన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు” .. అని సంయుక్తమేనని చెప్పే డైలాగ్.. ” అడిగింది కొనివ్వకపోతే పిల్లలు ఆ ఒక్క రోజే ఏడుస్తారు.. కానీ పిల్లల తల్లిదండ్రులు మాత్రం కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు..” ” వాళ్ళు గెలిచాం అనుకున్నారు.. కానీ డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మర్యాద అనేది చదువు వల్లే వస్తుంది..” అనే డైలాగ్స్ మాత్రం సినిమాకు సూపర్ హిట్టుగా నిలుస్తున్నాయి.
“విద్యారంగంలో వచ్చే అంత డబ్బు పాలిటిక్స్ లో కూడా రాదు” అని సముద్ర ఖనిచేత చెప్పించిన డైలాగు తోనే ఈ సినిమా నేపథ్యం ఏంటో మనకు అర్థమవుతుంది. చదివే జీవితం చదువు జీవితానికి పునాది లాంటిది అని చెప్పే కోణంలోనే ఈ సినిమా విడుదల అవబోతుంది. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మీద విమర్శనాస్త్రం లాగే ఈసారి సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సార్ గా ధనుష్ చాలా సహజంగా కనిపించాడు. మొత్తానికి అయితే ఈ సినిమా చాలా సక్సెస్ అయ్యేటట్టు కనిపిస్తోంది.