జయలలితతో విభేదాలు నిజమే.. ఎందుకంటే.. రజనీకాంత్

-

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా దివంగత నటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జయలలిత తనకు విభేదాలు ఉన్న విషయం నిజమేనంటూ చెప్పుకొచ్చారు..

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్లో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ ఈ వయసులో కూడా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న వ్యక్తిత్వం పరంగా అందనంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పటికీ తమిళ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఉండిపోయారు. అయితే తాజాగా రజనీకాంత్ మాట్లాడుతూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కోసం పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

జయలలిత గురించి ఒక ప్రత్యేక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రజనీకాంత్.. భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకలిగా పేరు సంపాదించుకున్న జయలలిత నిజంగా చాలా గొప్ప వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఆమెకు ఆమె దీటుగా వెళ్లారు అంటూ తెలిపారు. ఆమె స్థానం ఎప్పటికీ పదిలమేనంటూ చెప్పుకొచ్చిన రజనీకాంత్ ఆమెతో విభేదాలు ఉండేవని అన్నారు. అయితే ఆమె సిద్ధాంతాలు వేరు నా సిద్ధాంతాలు వేరు. ఈ విషయంలో మాత్రమే మా ఇద్దరికి ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. మేమిద్దరం ఎప్పుడు వేరు వేరు సూత్రాలను అనుసరించటం మూలంగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళం.. అయితే ఇందులో ఎవరు సిద్ధాంతం తప్పని కాదు ఎవరు ఒప్పని కాదు.. కానీ ఎవరి దారి వారిది అంటూ ఆసక్తిగారు కామెంట్ చేశారు..

అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లికి జయలలిత స్వయంగా ఇంటికి వచ్చి మరి శుభాకాంక్షలు తెలిపారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఆమెను ఎంతో మర్యాదపూర్వకంగా పలకరించానని చెప్పుకొచ్చారు. అలాగే జయలలిత ఎప్పుడూ గర్వం చూపించేవారు కాదని గర్వం లేని వ్యక్తిగా ఆమెను భావిస్తానని తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version