సంక్రాంతి సినిమాలు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు మాకు ఇంపార్టెంట్ కాదు – దిల్ రాజు

-

సంక్రాంతి సినిమాలు, సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదన్నారు దిల్ రాజు.  టిక్కెట్ రేటు, బెనిఫిట్ షోల పై చర్చ జరగలేదు అంటూ దిల్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డితో మీటింగ్‌ ముగిసిన అనంతరం దిల్‌ రాజ్‌ మాట్లాడారు. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందన్నారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని వివరించారు దిల్‌ రాజు. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారన్నారు దిల్ రాజు.

dil raju comments on cm revanth reddy meeting

ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని… టిక్కెట్ రేటు పై, బెనిఫిట్ షోలు పై ఇప్పుడు చర్చ జరగలేదన్నారు. ఇంకా మా చర్చలు అంత వరకు రాలేదని తెలిపారు. కేవలం ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో ఎదగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చ జరిగిందన్నారు దిల్‌రాజు. సంక్రాంతి సినిమాలు ముఖ్యం కాదని బాంబ్‌ పేల్చారు దిల్‌ రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version