లెక్క చెప్పి మరి కొట్టారు.. దిల్ రాజు చేతిలో సూపర్ హిట్టు బొమ్మ

-

కొన్ని సినిమాలు టీజర్, ట్రైలర్స్ తో అలరిస్తాయి. కాని సినిమా విషయానికొచ్చే సరికి తేడా కొట్టేస్తాయి. 100కి 90 శాతం వరకు ఊహించినది ఒకటి జరిగేది మరొకటి అవుతుంది. కాని ఈమధ్య టీజర్, ట్రైలర్ చూసి ఊహించిన దాని కన్నా దర్శకులు తమ సత్తా చాటుతున్నాతు. ముఖ్యంగా తమిళంలో ఈ ఒరవడి బాగా కనిపిస్తుంది.

లేటెస్ట్ గా కోలీవుడ్ లో రిలీజైన ఈ సినిమా 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా టీజర్ చూసే ఆడియెన్స్ ఇదేదో మంచి సినిమా అనుకున్నారు. ట్రైలర్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇక రిలీజైన సినిమా కూడా అంచనాలకు తగినట్టుగా వారెవా అనిపించేసింది. తమిళనాట ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

22 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమికుల కథగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా అక్కడ రిలీజ్ కాకముందే తెలుగు రీమేక్ కోసం దిల్ రాజు కొనేశాడు. సో దిల్ రాజు చేతిలో ఓ సూపర్ హిట్ సినిమా ఉందన్నమాట. ఈ సినిమాను తెలుగులో నాని, సమంతలతో రీమేక్ చేస్తారని అంటున్నారు. మరి లెక్క చెప్పి మరి హిట్టు కొట్టిన 96 తెలుగు వర్షన్ కు వచ్చే సరికి అదే సక్సెస్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version