మహర్షి కథ మొదలు పెట్టేది అక్కడే..!

-

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత చేస్తున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. మహర్షి సినిమా అమెరికాలో షెడ్యూల్ పూర్తి చేసుకు వచ్చింది. డార్జిలింగ్ తో పాటుగా హైదరాబాద్ లో కూడా ఓ మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహర్షి మూవీ త్వరలో ఓ విలేజ్ లో షూటింగ్ జరుపుకోనుందట.

మహర్షిలాంటోడికి విలేజ్ లో ఏం పని అంటే.. అసలు కథ ఇక్కడే మొదలవుతుందని అంటున్నారు. ఈ విలేజ్ సెట్ ను రామోజి ఫిల్మ్ సిటీలో వేస్తున్నారట. మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడట. 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version