థియేటర్ మాఫియా.. దిల్ రాజు చురకలివే..!

-

టాలీవుడ్ లో థియేటర్ మాఫియా జరుగుతుందని.. చిన్న సినిమాలను అసలు బ్రతకనివ్వడం లేదని.. థియేటర్స్ లేకుండా చేస్తున్నారని ఎన్నాళ్ల నుండో వినిపిస్తున్న మాట. ఇక లేటెస్ట్ గా రజినికాంత్ పేట సినిమా రిలీజ్ కు థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు అశోక్ వళ్లభనేని. అతని బాధని వ్యక్తపరుచుదాం అనుకున్నాడో ఏమో కాని పేట ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతని మాటలు మిస్ ఫైర్ అయ్యాయి.

ముఖ్యంగా అల్లు అరవింద్, దిల్ రాజు, యువి వాళ్ల మీద డైరెక్ట్ ఎటాక్ చేశాడు అశోక్. వారిని కుక్కలంటూ సంభోదించాడు. దానితో వ్యవహారం సీరియస్ అయ్యింది ఇక ఈరోజు ఎఫ్-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అశోక్ కామెంట్స్ కు స్పందిస్తూ ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మాకు వస్తాయి మాటలు. సదరు నిర్మాత ఇంతకుముందు రెండు సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశాడు మరి అప్పుడు కలగని ఇబ్బంది ఇప్పుడెలా కలుగుతుందని అన్నారు. సంక్రాంతి అంటే సినిమాల పండుగ అని తెలుగులో మూడు పెద్ద సినిమాలు వస్తున్నాయని వాటికే థియేటర్స్ ఎలా అంటూ ఆలోచిస్తుంటే తమిళ సినిమా తీసుకొచ్చి రిలీజ్ చేస్తామంటే ఎలా అని దిల్ రాజు గట్టిగానే వేసుకున్నాడు. మూడు సినిమాల్లో మూడు పెద్ద సినిమాలని.. వాటికే థియేటర్స్ సరిపోవట్లేదని అన్నారు.

అందరు వ్యాపారం చేయడానికే వస్తామని అందరికి మాట్లాడటం వచ్చని కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని అన్నారు దిల్ రాజు. ఎఫ్-2 సినిమా విషయమై సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version