ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, కవి, చిత్రకారుడు, బాలీవుడ్ నిర్మాత, మాజీ ఎంపీ ప్రీతిష్ నంది (73) మృతి చెందారు. ఆయన దక్షిణ ముంబయి లోని తన ఇంటిలో ఆయన హార్టెటాక్ తో బుధవారం తుది శ్వాస విడిచారు. ప్రతీష్ నంది కమ్యూనికేషన్స్ సంస్థను స్థాపించి చమేలీ, ఏక్ ఖిలాడి ఏక్ హసినా, అంఖే లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
అదేవిధంగా పలు వెబ్ సిరీస్ లను సైతం నిర్మించారు ప్రీతిష్ నంది. బిహార్ లోని భాగల్ పూర్ లో జన్మించిన ఆయన పాత్రికేయ వృత్తితో పాటు సినీ రంగంలో నిర్మాతగా, రాజకీయాల్లో ఎంపీగా తనదైన ముద్ర వేశారు. మరోవైపు పలు పుస్తకాలను రచించారు. వివిధ భాషల్లోని కవిత్వాన్ని అనువదించారు. 1998 నుంచి 2004 వరకు శివసేన తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సాహిత్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మక పద్మ శ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన మరణం పట్ల పలువురు దిగ్భాంతి వ్యక్తం చేశారు.