వివాదంలో డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ సినిమా

-

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు మ‌హేశ్ మంజ్రేక‌ర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న‌పై మ‌రాఠా సేవా సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే డైరెక్ట‌ర్ మ‌హేశ్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ నెల 14న న‌య్ వ‌ర‌న్ భ‌ట్ లోంచా కొన్ న‌య్ కోంచా అనే సినిమా విడుద‌ల అయింది. అయితే ఈ సినిమాలో అభ్యంత‌రక‌ర స‌న్ని వేశాలు ఉన్నాయని మ‌రాఠా సేవా సంస్థ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. అంతే కాకుండా.. ద‌ర్శ‌కుడు మ‌హేశ్ మంజ్రెక‌ర్ పై మ‌రాఠా సేవా సంస్థ కోర్టులో ఫిర్యాదు కూడా చేసింది.

అయితే న‌య్ వ‌ర‌న్ భ‌ట్ లోంచా కొన్ న‌య్ సినిమాలో ప‌లు శృంగార స‌న్నివేశాల్లో మ‌హిళ‌లు, చిన్నారుల‌ను అభ్యంత‌ర‌క‌రంగా చూపించార‌ని మ‌రాఠా సేవ సంస్థ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో డైరెక్టెర్ మ‌హేశ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టులో ఫిర్యాదు చేసింది. కాగ ఈ కేసు ఈ వ‌చ్చె నెల 28 న విచార‌ణ‌కు రానుంది. కాగ మ‌హేశ్ మంజ్ర‌కేర్ ద‌ర్శ‌కుడిగానూ న‌టుడిగానూ గుర్తింపు పొందాడు. తెలుగులోనూ ప‌లు సినిమాల‌లో విల‌న్ పాత్ర‌ల‌తో పాటు స‌హాయ న‌టుడి పాత్ర‌లోనూ న‌టించాడు. మ‌హేశ్ మంజ్రేక‌ర్ కూతురు స‌యీ మంజ్రేక‌ర్ తెలుగు గ‌ని, మేజ‌ర్ సినిమాల‌లో హీరోయిన్ గా న‌టిస్తుంది. అలాగే మ‌హేశ్ మంజ్రేక‌ర్ తెలుగులో ఆన్ శ్రీ‌ను, గుంటూర్ టాకీస్, విన‌య విధేయ రామ, సాహో వంటి సినిమాల‌లో న‌టించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version