జగన్ సర్కార్ కు షాక్.. ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ లేఖ

-

అమరావతి : జగన్ సర్కార్ కు ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ షాక్.. ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్సుకు ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ లేఖ రాసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్ఆర్ లు కావాలని లేఖలో వెల్లడించింది. సర్వీస్ రిజిస్టర్లు వెరిఫికేషన్ తరువాతే పే ఫిక్సేషన్ చేయగలమని లేఖలో పేర్కొంది.

తప్పు గా చెల్లింపులు చేస్తే డీడీఓలను ట్రెజరీ ఆఫీసర్లను బాధ్యులు చేస్తామంటూ జీవో జారీ చేశారన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు ఉద్యోగులు. ఎక్కువ చెల్లింపులు జరిపితే డీడీఓలు, ట్రెజరీ ఉద్యోగుల నుంచి రికవరీ పెడతామని పీఆర్సీ జీవోల్లో స్పష్టం చేశారని లేఖలో పేర్కొన్నారు ట్రెజరీ ఉద్యోగులు.

బిల్లులతో పాటు ఎస్ఆర్ లు అందుబాటులోకి వస్తే తప్ప ఏం చేయలేమని లేఖలో స్పష్టం చేసింది. తమకు కావాల్సిన సమయం ఇవ్వకపోతే పొరపాట్లు జరిగితే విలువైన ప్రజా ధనం నష్టపోయే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వానికి లేఖ పేర్కొంది ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version