‘కల్కి 2’పై ఫ్యాన్స్‌ ఊహాగానాలపై నాగ్‌ అశ్విన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ కలెక్షన్లు సాధించింది. ఇక మరికొన్ని గంటల్లో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నెట్టింట కల్కి-2 సినిమాపై వస్తున్న ఊహాగానాలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మరి ఆ ప్రశ్నలేంటి..? నాగీ సమాధానాలేంటో చుద్దామా?

సుమతి(దీపికా పదుకొణె)కి పుట్టిన వాళ్లు యాస్కిన్‌ను అంతం చేస్తారనే రూమర్పై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. దానికోసం భైరవ ఉన్నాడని క్లారిటీ ఇచ్చాడు. దుల్కర్‌ సల్మాన్‌ రెండో పార్ట్‌లో ప్రభాస్‌ పాత్ర వెనక ఉన్న మరో నిజాన్ని రివీల్ చేస్తారని మరో నెటిజన్ అనగా.. దీనికి సంబంధించి తానేం చదవలేదని.. అది నిజం కాదని చెప్పుకొచ్చాడు. ఈ ఊహాగానాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని.. ఇలాంటివి మరిన్ని అడిగితే పార్ట్‌2కు తన పని సులభం అవుతుందని నాగీ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version