ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కి వచ్చారు. మహేష్ బాబు-రాజమౌళి సినిమాకి సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో తెెరకెక్కుతున్న చిత్రం భారీ స్తాయిలో రూపొందుతుంది. మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇటీవలే ఒడిశాలో షూటింగ్ జరుపుకున్నారు. అక్కడ ముగిసిన వెంటనే విదేశాలకు షిప్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఒడిశాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆ వీడియోలు బయటికి వచ్చాయి. చాలా మంది షేర్, లైక్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. దీనిపై అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే చర్యలకు దిగింది. నెటిజన్లు షేర్ చేసిన వీడియోలను తొలగించింది.