ఆర్ఆర్ఆర్ ప్రి-రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ హీరో.. పునీత్ అన్న మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ బాగా అరుపులు, కేకలు వేస్తూ.. ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో దర్శకుడు రాజమౌళి ఫ్యాన్స్ పై కాస్త సీరియస్ అయ్యారు. మైక్ తీసుకుని.. మార్షల్స్, డాన్సర్లను స్టేజీ దిగి.. పోవాలని హెచ్చరించాడు. అటు ఫ్యాన్స్ కు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
తాను మాత్రం చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద గానే గౌరవిస్తానని.. సినిమా ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారికి రుణ పడి వుండాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సంతోష్ కుమార్ గారికి, ప్రకాష్ రాజ్, మంత్రి తలసాని శ్రీనివాస్ గారికి చాలా థాంక్స్ అంటూ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు చెప్పారు రాజమౌళి.
మా సినిమా టిక్కెట్ రెట్లు అడిగినప్పుడు అర్థం చేసుకొని అటు రెట్లు మరి పెంచకుండా అలాగే పేదవారికి భారం కాకుండా బ్యాలెన్స్ గా రెట్లు ఇచ్చారని… ఇందుకు సహకరించిన మంత్రులు పేర్ని నాని గారికి కోడలి నాని గారికి థాంక్స్ అన్నారు రాజమౌళి. గత పది నెలలుగా ఏపి కొత్త జీవో వచ్చినప్పుడు ఆ జీవో కరెక్ట్ గా లేదు ఇబ్బంది గా వుంది అని ఏపి ప్రభుత్వం కి చెప్పడానికి ఇండస్ట్రీ అంతా ట్రై చేసిందని… నేను కూడా ట్రై చేశాను కానీ ఎవ్వరం ముందుకు వెళ్ళలేక పోయామన్నారు. చిరంజీవి గారు నిజమైన మెగాస్టార్ అని.. చాలా మందికి తెలీదు తెలంగాణలో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి కారణమని పేర్కొన్నారు.