పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను కంగారు పెట్టిస్తున్న సుజిత్.!

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన ఫైట్స్, యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల అడ్డంకి  ఎదురవుతూనే ఉంది. రీసెంట్ గా ఈ  సినిమా షూటింగ్  రామోజీ ఫిల్మ్ సిటీలో  జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే తన రాబోయే సినిమాలు కూడా సూపర్ హైప్ తో ఉండనున్నాయట.

ఇక పవన్ కల్యాణ్ సాహొ డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.సుజిత్ సినిమా  పాన్ ఇండియా టార్గెట్ గా జపాన్, ఇండియా మధ్య నడిచే గాంగాస్టర్ పాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉండబోతుందట. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక గట్టి రూమర్ ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం ఈ సినిమా లో ఫైట్స్, పాటలు ఉండవని దాని సారాంశం. ఇది విని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో బాంబులు పడ్డట్లు గా అయ్యింది.సాంగ్స్ లేకపోతే ఒకే కానీ ఫైట్స్ కూడా లేకపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు గొణుగుతూ ఉన్నారట. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు.