దేశంలో జనాభా పెరగడం వల్ల అందరికి పని దొరకడం లేదు. ఖాళీగా ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో విమర్శలు, సెటైరికల్ వీడియోలు చేస్తున్నారు. ఖాళీగా ఉన్నవాళ్ళే సినిమాలు చూస్తున్నారు. వారి వల్లే సినిమాలు ఆడుతున్నాయి.
దర్శకుడు తేజ ముక్కుసూటి మనిషి. మనసులో ఏదున్నా డైరెక్ట్ గా చెప్పేస్తాడు. కొన్నిసార్లు అదేమంచి చేస్తే, మరికొన్ని సార్లు అదే చెడు చేస్తుంది. తాజాగా ఆయన ఆడియెన్స్ పై సెటైర్ వేశారు. పనీపాట లేనేవాళ్ళే సినిమాలు చూస్తారన్నారు.
అదే సమయంలో వాళ్ళే మా దేవుళ్ళు అంటూ ప్రశంసించారు. తాజాగా ఆయన సీత చిత్రాన్ని రూపొందించారు. బెల్లంకొండసాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా తేజ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దేశంలో జనాభా పెరగడం వల్ల అందరికి పని దొరకడం లేదు. ఖాళీగా ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో విమర్శలు, సెటైరికల్ వీడియోలు చేస్తున్నారు. ఖాళీగా ఉన్నవాళ్ళే సినిమాలు చూస్తున్నారు. వారి వల్లే సినిమాలు ఆడుతున్నాయి. మాకు డబ్బులొస్తున్నాయన్నారు. సినిమా రంగానికి చెందిన మంది ఇతర సినిమాలని ఏకడానికే చూస్తారు.
తీసే వాడి కంటే మనం గొప్ప అని చెప్పుకోవడానికి, లేకపోతే వాడికంటే మనం తెలివైన వాళ్ళమని చెప్పుకోవడానికి ఇలా చేస్తారు. అలాంటి పని తాను చేయనన్నారు. తన సినిమాలకు ఎప్పుడూ నెగటివ్ రివ్యూస్ వస్తాయన్నారు. అదే సమయంలో సినిమా విషయంలో తానెప్పుడూ సంతృప్తి చెందరట. ఇంకా బెటర్‌గా చేయాలని ఉంటుందని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ, ఏ దర్శకుడు తమ సినిమాలని జడ్జ్ చేయలేరు. అలానే చేయగలిగితే ఏ దర్శకుడు ఫ్లాప్ సినిమా చేయడు. సాధారణంగా చాలా మంది హీరోలు బాగా నటించగలరు. కానీ వారికి వారే ఓ గోడ కట్టేసుకుంటారు. ఆ గోడని దాటి ఏ దర్శకుడు ముందుకెళ్ళి నటనని రాబట్టలేరు. హీరోలు నటించలేరు. నేను అలా కాదు ఆ గోడని బద్దలు కొట్టి నటింపచేస్తా. ఇక షూటింగ్‌లో యాక్టర్స్‌ని కొడతాననే కామెంట్ మంచిదే. అ భయం ఉంటేనే నిజమైన, సీన్సియర్ యాక్టర్స్ వస్తారు.
నెక్ట్స్ ఇంకా ఏ సినిమా అనుకోలేదు. ఏదైనా ప్రస్తుతం ఆడుతున్న సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఆడియెన్స్ ఇచ్చే గిఫ్ట్ ని బట్టి మా నెక్ట్స్ సినిమా ఉంటుంది. సినిమా బాగా ఆడితే పెద్ద హీరో వస్తాడు, యావరేజ్‌గా ఆడితే యావరేజ్ హీరో వస్తాడు. లేకపోతే కొత్త హీరోతో చేయాలి. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ రాంగ్ సైడ్ వెళ్తుంది.
బడ్జెట్ ఉంది కదా అని అనవసరమైన హంగులకు పోతున్నారు. దీంతో కథ పక్కదారి పడుతుంది. కథకి, పాత్రకి ఏది అవసరమో అదే పెట్టాలి. ఇప్పుడున్న సీనియర్ దర్శకులపై నేనేమి కామెంట్ చేయలేను. ఎందుకంటే నాకంత బ్రెయిన్ లేదు. ఎన్టీఆర్ బయోపిక్ కి నేను న్యాయం చేయలేనని తప్పుకున్నా. కానీ చాలా మంది మంచి ప్రాజెక్ట్ ని ఎందుకు వదులుకున్నావన్నారు. సినిమా విడుదలయ్యాక తప్పుకొని మంచి పని చేశావన్నారు(నవ్వుతూ) అని చెప్పారు.