2014లో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ లాక్కున్నది. ఇప్పుడు టీడీపీలో 23 మంది మాత్రమే మిగిలారు. 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
వైఎస్సార్సీపీ ఇటీవల వెలువడిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా కలిసి వైఎస్ జగన్‌ను వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం.. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజల విశ్వాసం చూరగొని తాము అధికారంలోకి వచ్చామన్నారు. ఏపీలో 50 శాతం ఓటింగ్‌ను వైఎస్సార్సీపీ సాధించడం గొప్ప పరిణామమన్నారు.
2014లో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ లాక్కున్నది. ఇప్పుడు టీడీపీలో 23 మంది మాత్రమే మిగిలారు. 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. మే 23న దేవుడు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాడు. 2024లో మరింత మెజారిటీని పార్టీ సాధించాలి. అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి పెడతాం. తమ పాలన ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండేలా ఉంటుంది.. అని జగన్ తెలిపారు.