చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు.. హీరోలందరూ ఒకే చోట

-

టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో దీపావళి సంబరాలు నిర్వహించారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. టాలీవుడ్ సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, సతీ సమేతంగా చిరంజీవి ఇంటికి వచ్చారు. దీంతో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

Diwali In Chiranjeevi Home yesterday

ఇక నిన్న దేశవ్యాప్తంగా దీపావళి పండుగ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లలో కూడా దీపావళి పండుగ సందడి నెలకొంది. ఇక దీపావళి పండుగను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ సభ్యులతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య ప్రాణతి అలాగే కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో జూనియర్ ఎన్టీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవి కాస్త వైరల్ అయ్యాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ఫోటోలు అదిరిపోయాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version