వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా మరో రికార్డును చేరుకుంది. ప్రపంచ కప్ టోర్నమెంట్లో టీమిండియా తన రికార్డును… తానే బద్దలు కొట్టుకుంది. ప్రపంచ కప్ లో వరుసగా తొమ్మిది మ్యాచ్లు గెలిచి అదరహో అనిపించింది టీమిండియా. 2003 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్లు నెగ్గింది.
ఇప్పుడు 9 గెలిచి ఆ రికార్డును తిరగరాసింది టీమిండియా. ఇక ఓవరాల్ గా ఆస్ట్రేలియా వరుసగా 11 మ్యాచ్లు ఆడి గెలిచింది. 2003 మరియు 2007 ప్రపంచ కప్ లలో ఆస్ట్రేలియా ఈ రికార్డు నెలకొల్పింది. సెమిస్ మరియు ఫైనల్ లోను టీమిండియా గెలిస్తే ఆ రికార్డు సమం అవుతుంది.
కాగా, నిన్న జరిగిన నెదర్లాండ్ జట్టుపై కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 410 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నెదర్లాండ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.