సిద్ధార్థ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా 2006 విడుదల అయిన సినిమా బొమ్మరిల్లు. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత.. సిద్ధార్థ్ కు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. అవకాశాలు కూడా పెరిగాయి. హాసిని అనే పాత్రలో నటించిన హీరోయిన్ జెనీలియాకు కూడా బొమ్మరిలు.. మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత జెనీలియా సూపర్ ఫామ్ లోకి వచ్చింది. వరుసగా సినిమాలను కూడా చేసింది.
అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన భాస్కర్ కు ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ అనే పేరే వచ్చింది. అంతే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా చేసే అవకాశం దక్కింది. అంటే బొమ్మరిలు సినిమా.. దాదాపు అందరికీ లైఫ్ ఇచ్చింది. అయితే ఇలాంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులకున్న ఒక హీరో ఇప్పటికీ బాధ పడతున్నారు.
అతను ఎవరో కాదు.. నవదీప్. తెలుగు ఇండస్ట్రీకి నవదీప్ హీరో పరిచయం అవుతున్న రోజుల్లోనే బొమ్మరిల్లు కథతో నిర్మాత దిల్ రాజు.. నవదీప్ ను సంప్రదించాడట. అయితే అప్పటికే నవదీప్ జై అనే సినిమా చేసిన తర్వాత.. గౌతమ్ ఎస్ఎస్సీ, మొదటి సినిమా, ప్రేమంటే ఇంతే అనే సినిమాల్లో బిజీ గా ఉన్నాడు.
దీంతో బొమ్మరిల్లు సినిమా చేయడానికి నవదీప్ నో చెప్పాడు. అయితే ఆ సమయంలో నవదీప్ చేసిన సినిమాలు అన్నీ కూడా ప్లాప్ అయ్యాయి. కానీ బొమ్మరిల్లు మాత్రం సూపర్ హిట్ అందుకుంది. దీంతో బొమ్మరిల్లు సినిమా చేయాల్సింది.. అని నవదీప్ ఇప్పటికీ బాధపడుతు ఉన్నాడు. ఈ విషయాన్ని నవదీప్ పలు ఇంటర్వ్యూలలో స్వయంగా చెప్పాడు. కాగ నవదీప్ ఒక వేళ బొమ్మరిల్లు సినిమా చేసి ఉంటే.. ఇప్పటి వరకు కూడా ఒక మంచి హీరోగా గుర్తింపు ఉండేది.