చిరంజీవి ఆస్తి ఎన్ని కోట్లుకు అధిపతో తెలుసా..?

-

ప్రముఖ టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన నటన గురించి, డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను మైమరిపిస్తూ.. ఎన్నో చిత్రాలను తెరకేక్కించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అంతేకాదు సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారంటే ఇక ఆయన సక్సెస్ రేట్ ఎంత ఉందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు తాను సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలాగే పలు యాడ్స్, మరికొన్ని బ్రాండ్ ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ కొన్ని వేల కోట్లను వెనకేసుకున్నారు చిరంజీవి.. సినిమాల పరంగా యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న చిరంజీవి ప్రాపర్టీ ఎంత ఉంటుంది అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.చిరంజీవికి కార్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోని అత్యంత అరుదైన కార్ కలెక్షన్స్ అంతా ఆయన గ్యారేజ్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఆ కార్ ల విలువ సుమారుగా రూ.150 కోట్లకు పైగానే అన్నట్లుగా సమాచారం. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్ తో పాటు మరికొన్ని ప్రదేశాలలో ఈయనకు ఖరీదైన భవంతులు కూడా ఉన్నాయి. వాటి విలువ సుమారుగా రూ. 200 కోట్లకు పైగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఒక్కొక్క సినిమాకు ఈయన రూ.30 నుంచి రూ.40 కోట్ల పారితోషకం అందుకుంటారు. ఇక నికర ఆస్తి విలువ అలాగే పెట్టుబడులు.. విషయానికొస్తే సుమారుగా 1500 కోట్ల రూపాయలకి అధిపతి అని చెప్పవచ్చు..ఇక అంతే కాదు పలు సేవా సంస్థలను కూడా ఆయన స్థాపించారు . ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందికి ఆక్సిజన్ తో సహా పలు వైద్య రకాల సేవలను అందించిన విషయం తెలిసిందే.. మొత్తానికైతే ఎంత గొప్ప ఆస్తిపరాడో అంతే గొప్ప మనసున్న వాడు అని నిరూపించుకున్నారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version