సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్ట్ లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ ద్వారా నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అయితే నాలుగవ టెస్ట్ లో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు నితీష్ కుమార్ రెడ్డి.

ఈ క్రమంలో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. టెస్టుల్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన మూడవ భారతీయ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కావడం సంతోషం కలిగిస్తుందన్నారు చంద్రబాబు. అతను భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ఇక నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. నితీష్ కి 25 లక్షల నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు ఏసిఏ అధ్యక్షుడు, ఎంపీ కేసీనేని చిన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబును కలిశారు నితీష్ కుమార్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబును నితీష్ కుమార్ రెడ్డి, అతని తండ్రి ముత్యాల రెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఏసీఏ ప్రకటించిన 25 లక్షల చెక్కును నితీష్ కుమార్ రెడ్డికి అందజేశారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version